హైదరాబాద్‌కు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో వర్షం

Hyderabad gets relief as rain lashes several parts of the city
  • హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
  • వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం
  • గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో జల్లులు
గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరవాసులకు శనివారం ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

శనివారం సాయంత్రం గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బోరబండ, యూసుఫ్‌గూడ, ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. దీంతో ఎండ వేడిమి నుంచి నగరవాసులకు ఊరట లభించింది. ఇక పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాలోని కొహెడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Go Back to Shorts
Hyderabad
Hyderabad Rains
Telangana Weather Update
Gachibowli Rain
Jubilee Hills Rain
Summer Heat Relief

More Telugu News