వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు

  • భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్లా బ్రహ్మనాయుడు
  • హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
  • అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు

దాదాపు రూ.1,500 కోట్ల విలువైన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌ పై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ ల్యాండ్ గ్రాబింగ్ వివాదంలో నార్సింగి పోలీసులు తనతో పాటు మరికొందరిపై నమోదు చేసిన కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన ముందస్తుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో స్పందించాలంటూ అటు నార్సింగి పోలీసులకు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం, ఆధారాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.


ఇరుపక్షాల ప్రాథమిక వాదనలను విన్న అనంతరం, హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. 


Bolla Brahmanaidu
YSRCP
TG High Court

More Telugu News