కేటీఆర్ అలాంటి పొరపాటు వ్యాఖ్యలు చేయరు: పవన్ కల్యాణ్
- కేటీఆర్ తనపై తప్పుగా మాట్లాడి ఉండరన్న పవన్ కల్యాణ్
- తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి
- మళ్లీ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని స్పష్టీకరణ
"కేటీఆర్ గారు ఏమన్నారో నేను పూర్తిగా చూడలేదు. కానీ, నాకు తెలిసి ఆయన పొరపాటు మాటలు మాట్లాడరు. బహుశా ఆయన నా పూర్తి వ్యాఖ్యలు చూడలేదేమో. ఆయన ఒక సరైన దృక్పథంతోనే మాట్లాడి ఉంటారని అనుకుంటున్నా. కొన్నిసార్లు విషయాలను చిలికి చిలికి గాలివానలా మారుస్తుంటారు. దీనిపై అంతకుమించి ఏమీ లేదు" అని పవన్ కళ్యాణ్ వివరించారు.
విధానపరమైన అంశాల్లో భేదాభిప్రాయాలు ఉండటం సహజమని, అయితే తమ వ్యక్తిగత సంబంధం వేరని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని, తామిద్దరం ఎప్పుడైనా కలిసినప్పుడు దీని గురించి సరదాగా మాట్లాడుకుంటామని పవన్ కల్యాణ్ తేలికగా వ్యాఖ్యానించారు.