కృష్ణ ఫ్యాన్స్ ను మెప్పిస్తున్న కుర్రాడి కటౌట్!

02-06-2026 Tue 17:39 | Entertainment
Advertisement
  • హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ 
  • తొలి సినిమాగా 'శ్రీనివాస మంగాపురం'
  • ఇదే సినిమాతో రషా థడాని పరిచయం 
  • జులై 9న విడుదల కానున్న సినిమా
Advertisement
తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికీ మరిచిపోలేని హీరో కృష్ణ. ఆయన చేసిన సినిమాలే కాదు .. సాహసోపేతమైన నిర్ణయాలు .. ప్రయోగాలు అలా మైలురాళ్లను సెట్ చేసి పెట్టాయి. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేశ్ బాబు మరో సూపర్ స్టార్ గా తన హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు 'జయకృష్ణ' కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

' RX 100' సినిమాతో ఒక భారీ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి, ఆ తరువాత కూడా తన మార్క్ సినిమాలను ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ఆయన దర్శకత్వం వహించిన 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. రీసెంటుగా వదిలిన ఈ సినిమా 'గ్లింప్స్' చూసినవాళ్ల నుంచి జయకృష్ణకి మంచి మార్కులే పడుతున్నాయి. కటౌట్ కరెక్టుగానే ఉందని చెప్పుకుంటున్నారు. సైడ్ నుంచి అచ్చు రమేశ్ బాబులా కనిపిస్తున్న జయకృష్ణ, నటన పరంగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడేమో చూడాలి.

ఈ సినిమాతో రవీనా టాండన్ కూతురు 'రషా థడాని' హీరోయిన్ గా పరిచయమవుతోంది. బాలీవుడ్ బ్యూటీ అనిపించుకున్న రవీనాకి తెలుగులో 'బంగారు బుల్లోడు' .. 'రథసారధి' వంటి హిట్స్ ఉన్నాయి. ఇక ఇప్పటి యూత్ ను అలరించడానికి రషా థడాని సిద్ధమవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జులై 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో ఈ కొత్త జంట దూసుకుపోతుందేమో చూడాలి. 

Advertisement
-

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more