ప్రపంచ పటంలో ఏపీ.. మా విజయం వెనుక మూడు కారణాలు: ముంబైలో నారా లోకేష్
- ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్
- సమర్థ నాయకత్వం, వేగవంతమైన పాలనే ఏపీ ప్రగతికి కారణమన్న మంత్రి
- డేటా సెంటర్లపై అపోహలు వీడాలి.. ఏఐలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం
- మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
- 2028 నాటికి అమరావతి ప్రభుత్వ కోర్ నిర్మాణం పూర్తి చేస్తాం
సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో సోమవారం నిర్వహించిన '2026 ఇండియా కాన్ఫరెన్స్'లో ఆయన పాల్గొన్నారు. 'అభివృద్ధికి కొత్త సరిహద్దులు' అనే పేరుతో జరిగిన ఈ సదస్సులో భాగంగా "భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్ధం చేయడం - ఆంధ్రప్రదేశ్ అనుభవం" అనే అంశంపై నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్‌లో లోకేష్ ప్రసంగించారు. కంట్రీ ఎగ్జిక్యూటివ్ విక్రమ్ సాహు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో లోకేష్, రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు.
ప్రగతికి మూడు మూలస్తంభాలు
ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని లోకేష్ వివరించారు. "మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమర్థ నాయకత్వం. నగరాలను నిర్మించడంలో, పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లను అభివృద్ధి చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకప్పుడు సైబరాబాద్‌తో నిరూపించిన ఆయన, ఇప్పుడు అదే దార్శనికతతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు" అని పేర్కొన్నారు.
రెండోది, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అని తెలిపారు. "విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను తీసుకువచ్చాం. గ్రీన్ స్టీల్ రంగంలో దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐలలో ఒకటైన ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును కేవలం 17 నెలల్లోనే ప్రారంభించగలిగాం. ఈ వేగమే మమ్మల్ని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా నిలుపుతోంది" అని అన్నారు.
ఇక మూడోది, రాష్ట్రంలో 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' ఉండటమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ, డేటా సెంటర్లే భవిష్యత్తు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని లోకేష్ తెలిపారు. "రాష్ట్రవ్యాప్తంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే కేవలం 13 నెలల్లోనే గూగుల్ డేటా సెంటర్‌ను ఏపీకి తీసుకువచ్చాం. పాలసీ రూపకల్పన, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, భూమి గుర్తింపు వంటి అంశాల్లో సమష్టిగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది" అని వివరించారు.
డేటా సెంటర్ల ద్వారా కేవలం ఆర్థిక వృద్ధే కాకుండా, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయని, తద్వారా ఉద్యోగ కల్పన పెరుగుతుందని అన్నారు.
డేటా సెంటర్లపై అపోహలు వద్దు
డేటా సెంటర్లపై ప్రజల్లో ఉన్న భయాలను, అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. "కొందరు డేటా సెంటర్లు మంచివంటే, మరికొందరు చెడ్డవంటారు. వాస్తవాలను గణాంకాలతో వివరించాలి. ఉదాహరణకు, ప్రతి ఏటా గోదావరి నుంచి దాదాపు 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతోంది.
మనం నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు అవసరమయ్యేది కేవలం ఒక్క టీఎంసీ నీరు మాత్రమే. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది. కానీ చర్చంతా డేటా సెంటర్ల గురించే జరుగుతోంది. ఈ విషయాలను యువతకు వివరించి, వారిలో ధైర్యం నింపాలి" అని అన్నారు.
యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పనే లక్ష్యం
ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారతాయే తప్ప, ఉపాధి అవకాశాలు తగ్గవని లోకేష్ భరోసా ఇచ్చారు. "ఉద్యోగాలు వెతుక్కునే యువతను కాకుండా, ఉద్యోగాలు సృష్టించే యువతను తయారు చేయడమే మా లక్ష్యం. అందుకే సీఎం చంద్రబాబు నాకు విద్య, ఐటీ శాఖలను కలిపి అప్పగించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్ వంటి ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా మన పాఠ్య ప్రణాళికను మారుస్తున్నాం" అని వివరించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
ప్రపంచస్థాయి నగరంగా అమరావతి
చంద్రబాబు ఒకప్పుడు సైబరాబాద్‌ను నిర్మిస్తే, ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నారని లోకేష్ అన్నారు. "రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించి, పూర్తిస్థాయి గ్రీన్‌ఫీల్డ్ నగరాన్ని నిర్మిస్తున్నాం. 2019లో ప్రభుత్వం మారడంతో పనులు నెమ్మదించినా, ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకున్నాయి. 2028 నాటికి ప్రభుత్వ కోర్ సిద్ధమై దేశానికి అంకితం చేస్తాం.
ఇప్పటికే విట్, ఎస్ఆర్‌ఎం వంటి సంస్థలు అక్కడ ఉన్నాయి. బిట్స్ పిలానీ తమ క్వాంటం క్యాంపస్‌ను అమరావతిలోనే నిర్మిస్తోంది. ఇది దేశంలోనే ఒక ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి జరుగుతున్న అద్భుత ప్రయత్నం," అని లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే దేశం గెలుస్తుందని, ఆశించిన మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.