బెంగళూరులో సంబరాలు లేవు.. నేరుగా ఇళ్లకే ఆర్సీబీ ఆటగాళ్లు!
- వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ
- బెంగళూరులో సంబరాలు లేకుండానే ఇళ్లకు బయల్దేరిన ఆటగాళ్లు
- డేటా ఆధారిత విశ్లేషణే విజయాలకు కారణమని వెల్లడి
- జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్
- ఫ్రెడ్డీ సాయంతోనే తన బ్యాటింగ్ మెరుగైందన్న కెప్టెన్ రజత్ పటీదార్
"దురదృష్టవశాత్తు మేమెవరమూ బెంగళూరు వెళ్లడం లేదు. నేను యూకేకు తిరిగి వెళ్తున్నాను. రజత్ తన కుటుంబంతో సమయం గడపడానికి ఇంటికి వెళుతున్నాడు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ హాలిడే ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి మా అభిమానులను కలుసుకోవడానికి మరికొంత కాలం వేచి ఉండాలి" అని బొబాట్ తెలిపారు.
ఒకప్పుడు ఐపీఎల్లో 'అండర్ అచీవర్స్'గా ముద్రపడిన ఆర్సీబీ, 2025 నుంచి అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు టైటిళ్లు గెలుచుకుంది. ఈ భారీ మార్పు వెనుక డేటా, అనలిటిక్స్‌తో కూడిన సమతుల్య విధానం కీలక పాత్ర పోషించిందని బొబాట్, కెప్టెన్ రజత్ పటీదార్ వివరించారు. లీడ్ అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటార్ దినేశ్ కార్తీక్ వంటి వారి ఆధ్వర్యంలో జట్టును నిర్మించడం నుంచి మ్యాచ్ వ్యూహాల వరకు ప్రతి విషయంలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
"మేం కేవలం డేటాపైనే ఆధారపడం. ఆధారాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇందులో డేటాతో పాటు నిపుణుల అనుభవం, అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం" అని బొబాట్ అన్నారు. ఈ విజయాల్లో అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ పాత్ర ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు.
కెప్టెన్ రజత్ పటీదార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తన ఆటతీరు మెరుగుపడటానికి ఫ్రెడ్డీ విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాడు. "కొందరు బౌలర్లను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడినప్పుడు ఫ్రెడ్డీని సంప్రదించాను. అతని సూచనలు నా బ్యాటింగ్‌ను మెరుగుపరిచాయి. నా ఆటతీరులో మార్పుకు కారణం ఫ్రెడ్డీనే" అని పటీదార్ స్పష్టం చేశాడు.