చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
- కాకినాడ జిల్లాలో కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు
- పోలరపు సింహాచలం అనే కార్మికుడికి స్వయంగా పింఛను అందజేత
- కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులకు ఆదేశం
- గీత కార్మికుల కష్టాలు తెలుసుకుని తాటికల్లు రుచిచూసిన సీఎం
ఈ సందర్భంగా సింహాచలం కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం, వారి జీవన విధానం గురించి ఆరా తీశారు. అత్యంత శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిలోని కష్టనష్టాలు, ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో, తమకు సొంత ఇల్లు లేదని సింహాచలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించారు. ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు.
అనంతరం, తాటి చెట్టు నుంచి కల్లు తీసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. గీత కార్మికులు అప్పుడే తీసిన తాజా తాటి కల్లును రుచి చూశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను, ఫొటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. పేద ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.


