సీఎం విజయ్‌పై నటి జూలీ సంచలన ఆరోపణలు!

  • తన గర్భస్రావానికి విజయ్ పరోక్షంగా కారణమన్న జూలీ
  • విజయ్ అభిమానుల ట్రోలింగ్ వల్ల తాను మానసిక క్షోభకు గురయ్యానని వెల్లడి
  • విజయ్ తన అభిమానులను కంట్రోల్ చేసి ఉంటే తన బిడ్డ బతికేదని వ్యాఖ్య

ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్ బాస్ ఫేమ్ జూలీ... తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన గర్భస్రావానికి సీఎం విజయ్ పరోక్షంగా కారణమంటూ ఆమె వ్యాఖ్యానించారు.


జల్లికట్టు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన జూలీ, ఇటీవల ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తనపై నిరంతరాయంగా చేసిన ట్రోలింగ్, వేధింపుల వల్లే తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని, తద్వారా తన కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. "నా బిడ్డను కోల్పోవడానికి విజయ్ అన్నే బాధ్యుడు. ఆయన నేరుగా ఈ పని చేయకపోయినా.. తన అభిమానులను ఆపమని ఒక్క మాట చెప్పి ఉంటే నేను బిడ్డను కోల్పోయేదాన్ని కాదు" అని జూలి ఆరోపించారు.


గత ఎన్నికల సమయంలో విజయ్ రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం, మెరీనా బీచ్ వద్ద నిరసన తెలపడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని జూలీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణమైన కామెంట్లు పెట్టారని, చివరకు తనపై రూ. 15 లక్షల విలువైన నకిలీ కిడ్నీ స్కామ్ ఆరోపణలు కూడా సృష్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రజలు విజయ్ అన్న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సీఎం అయ్యారని అంటున్నారు. 

జూలీ చేసిన ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి విజయ్ మద్దతుదారులు, టీవీకే నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతోందని మండిపడుతున్నారు. కాగా, ఆన్‌లైన్ వేధింపులపై జూలీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై సీఎం విజయ్ లేదా టీవీకే పార్టీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

Julie
Actress Julie
Vijay TVK Party
Tamil Nadu Politics
Online Harassment
Social Media Trolling
Kollywood Controversy
Jallikattu Protest
Kidney Scam Allegations
TVK Party

More Telugu News