ఏపీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కి పెంపు?.. విద్యాశాఖ అధికారి వ్యాఖ్యలతో కొత్త చర్చ!
- ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై మళ్లీ చర్చ
- వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందన్న విద్యాశాఖ అధికారి
- నెల్లూరు జిల్లాలో ఓ సన్మాన సభలో జేడీ మువ్వా రామలింగం వ్యాఖ్యలు
- ప్రస్తుతం రాష్ట్రంలో 62 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోసారి పెరగనుందా? ఈ అంశంపై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు విద్యాశాఖ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్నిచ్చాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశం ఉందని విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ డైరెక్టర్ (జేడీ) మువ్వా రామలింగం పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కావలి డిప్యూటీ డీఈవో ఎం. హరిప్రసాద్ పదవీ విరమణ సన్మాన సభలో మువ్వా రామలింగం ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అవుతున్న హరిప్రసాద్ మరో నాలుగు నెలలు సర్వీసులో ఉంటే బాగుండేదని, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెరిగే సూచనలు ఉన్నాయని తెలిపారు.
ఈ సమయంలో ఓ స్కూల్ హెడ్‌మాస్టర్ కలుగజేసుకుని, శాఖాపరమైన ఒత్తిళ్లతో ఉన్నామని, తమకు సర్వీసు వయసు పొడిగింపు వద్దని అన్నారు. దీనిపై స్పందించిన రామలింగం, పైకి అలా అన్నా ఉద్యోగ కాలం పెరిగితే కొనసాగేందుకే అందరూ ఇష్టపడతారని బదులిచ్చారు. తన వరకు మరో పదేళ్లయినా, అంటే 72 ఏళ్ల వరకు పనిచేసేందుకు సిద్ధమని ఆయన చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉంది. గతంలో ప్రభుత్వం ఈ వయసును పెంచినప్పుడే ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, కీలక స్థానంలో ఉన్న అధికారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నిజంగా ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి.