Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

CM Chandrababu Pays Tribute to Superstar Krishna on Birth Anniversary
Advertisement
  • సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
  • తెలుగు సినిమాకు కృష్ణ సేవలు మరువలేనివని కొనియాడిన సీఎం
  • నూతన సాంకేతికతను పరిశ్రమకు పరిచయం చేశారని ప్రశంస
Advertisement
సూపర్ స్టార్, పద్మభూషణ్ ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయనను ఓ గొప్ప నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా కొనియాడారు. కృష్ణ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా స్పందించారు.

తెలుగు సినిమాకు నూతన సాంకేతికతను పరిచయం చేయడంలో కృష్ణ ముందున్నారని, ఆయన కృషితోనే తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కిందని చంద్రబాబు ప్రశంసించారు. సినీ రంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

"తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు" అని సీఎం చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Chandrababu
AP CM
Krishna Ghattamaneni
Telugu Cinema
Telugu Film Industry
Padma Bhushan
Superstar Krishna
Telugu Movies
Film Director
Film Producer

More Telugu News