తిరుమల శ్రీవారికి ఖరీదైన బస్సు విరాళంగా ఇచ్చిన భక్తురాలు

Neera Radia Donates Electric Bus to Tirumala Temple
  • రూ.1.13 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సు విరాళమిచ్చిన నీరా రాడియా
  • బస్సుతో పాటు 15 ట్యాబ్‌ల అందజేత
  • భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథం సేవలో చేరనున్న కొత్త బస్సు
  • దాత‌కు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ధన్యవాదాలు
తిరుమలను కాలుష్య రహిత పుణ్యక్షేత్రంగా మార్చేందుకు టీటీడీ చేస్తున్న కృషిలో మరో ముందడుగు పడింది. దాత నీరా రాడియా, టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక విద్యుత్ బస్సుతో పాటు సుమారు రూ.20 లక్షల విలువైన 15 ట్యాబ్‌లను విరాళంగా అందజేశారు. ఈ విరాళం పర్యావరణ హిత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు దోహదపడనుంది.

నేడు తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఈ కొత్త బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత నీరా రాడియా, బస్సు తాళాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ.. దాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన నీరా రాడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కొత్త బస్సును తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ఉచిత 'ధర్మరథం' సర్వీసులో చేర్చనున్నారు. ప్రస్తుతం ధర్మరథం సేవలో 20 బస్సులు ఉండగా, వాటిలో 14 ఇప్పటికే విద్యుత్ బస్సులే. ఈ బస్సులు 21 బస్ స్టాప్‌ల మీదుగా రోజూ 380 ట్రిప్పులు తిరుగుతూ భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. త్వరలోనే మిగిలిన డీజిల్ బస్సుల స్థానంలో కూడా పూర్తిగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడమే తమ లక్ష్యమని టీటీడీ ఛైర్మన్ వివరించారు. ఈ విరాళం ఆ లక్ష్య సాధనకు మరింత ఊతమివ్వనుంది.
Go Back to Shorts
TTD
Tirumala
Neera Radia
Electric Bus Donation
Dharma Ratham
BR Karunakar Reddy
Tirumala Temple
Free Bus Service
AP News
Environmental Initiatives

More Telugu News