తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

Telangana Weather Red Alert Issued for Several Districts
  • పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిక
  • మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులకు అవకాశం
  • ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఈరోజు మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండవచ్చని పేర్కొంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని హెచ్చరించింది.

ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సిద్దిపేట, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కూడా ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Go Back to Shorts
Telangana Weather
Hyderabad Meteorological Center
Red Alert
Heatwave
Orange Alert
Rain Forecast

More Telugu News