సేమ్ సీన్ రిపీట్.. సుదర్శన్‌ది మళ్లీ అదే తీరు..!
- రాజస్థాన్ రాయల్స్‌పై సేమ్ సీన్ రిపీట్ చేసిన సాయి సుదర్శన్
- వరుసగా రెండోసారి హిట్ వికెటైన యువ బ్యాటర్
- బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే ఔటైన వైనం
- ఐపీఎల్ చరిత్రలోనే ఇలా ఓ బ్యాటర్ వరుసగా రెండుసార్లు హిట్ వికెట్ కావడం ఇదే తొలిసారి
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104) అద్భుత సెంచరీతో కదం తొక్కడంతో ఐపీఎల్ 2026 ఫైనల్లోకి గుజరాత్ టైటాన్స్ ఘనంగా ప్రవేశించింది. నిన్న ముల్లన్‌పూర్‌లో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి ఛేదించింది.
ఈ ఛేదనలో గిల్ ఆరంభం నుంచి చివరి వరకు నిలిచి గుజరాత్‌ను నడిపించాడు. కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి ఓపెనర్ సాయి సుదర్శన్ (58) అండగా నిలిచాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 167 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. 32 బంతుల్లో 58 పరుగులు చేసిన సుదర్శన్, దురదృష్టవశాత్తూ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ అతడు సేమ్ సీన్ రిపీట్ చేయడం గమనార్హం.
ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న సుదర్శన్
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ఒక అరుదైన, చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రిజేష్ శర్మ వేసిన బంతిని బౌండరీకి తరలించే క్రమంలో అతని చేతిలోంచి బ్యాట్ జారి వికెట్లపై పడింది. దీంతో అతను వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే ఔటయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో హిట్ వికెట్ అయిన తొలి బ్యాటర్‌గా సుదర్శన్ నిలిచాడు. అతని ఔట్ తీరు చూసి నాన్-స్ట్రైకర్‌గా ఉన్న గిల్ తీవ్ర నిరాశతో మైదానంలోనే మోకాళ్లపై కూలబడ్డాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (96) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, డొనోవన్ ఫెరీరా (38 నాటౌట్) వేగంగా ఆడి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. "ఇది కాపాడదగిన స్కోరే కానీ, రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించింది. ఆరంభంలోనే వికెట్లు తీయలేకపోవడం మాకు నష్టం కలిగించింది. ఈ సీజన్లో మా యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించడం సానుకూలాంశం" అని తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు.