సందీప్‌ రెడ్డి వంగా నిర్మాతగా "రోమాంచకం"

Sandeep Reddy Vanga Producing Romanchakam
  • యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా 'రోమాంచకం' 
  • సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్‌ 
  • సోదరుడు ప్రణయ్‌ రెడ్డితో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్న సందీప్‌ రెడ్డి

టాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న సందీప్‌ రెడ్డి వంగా, బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌, యానిమల్‌ చిత్రాలతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా 'స్పిరిట్‌' అనే చిత్రం తెరకెక్కుతోంది. కాగా సందీప్‌ రెడ్డి వంగా నిర్మాతగా తన సొంత బ్యానర్‌లో 'రోమాంచకం' అనే సినిమాను నిర్మిస్తున్నారు. 

భద్రకాళి పిక్చర్స్‌ పతాకంపై సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్నారు. వేణుగోపాల్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 'రోమాంచకం' టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 



Go Back to Shorts
Sandeep Reddy Vanga
Romanchakam
Telugu Cinema
Prabhas Spirit
Bhadrakali Pictures
Pranay Reddy Vanga
Sumanth Prabhas
Ananthika Sanil Kumar
Venugopal Reddy
Youthful Entertainer

More Telugu News