జగన్ పీఏకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి?: పట్టాభి

Pattabhi Questions Jagan PAs Wealth in Liquor Scam
  • లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు దోచుకున్నారన్న పట్టాభి
  • అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలస్ వైపే చూపిస్తున్నాయని వ్యాఖ్య
  • జగన్ పీఏకు మూడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపణ
వైసీపీ నేతలపై స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ నేత పట్టాభి తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్ లో వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలస్ వైపు చూపిస్తున్నాయని చెప్పారు. గొడ్డలి పార్టీకి కూడా పీ4 పథకం ఉందని... అదేంటంటే 'పవర్, ప్రాపర్టీ, పైసా, పార్టనర్ షిప్' అని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడమే గొడ్డలి పార్టీ పీ4 పథకం అని చెప్పారు.  

జగన్ పీఏ నాగేశ్వరరావు (కేఎన్ఆర్) భార్య ఖాతాలోకి 2019-24 మధ్య కాలంలో రూ. 20 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఒక సాధారణ పీఏ భార్య ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. బెంగళూరుతో పాట పలు ప్రాంతాల్లో ప్లాట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. జగన్ పీఏకు మూడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని అన్నారు. 

మరోవైపు లిక్కర్ స్కామ్ లో కేఎన్ఆర్ ను సిట్ అధికారులు నిన్న ప్రశ్నించారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు విచారించారు. 
Go Back to Shorts
Pattabhi Ram Kommareddy
YSRCP
TDP
Liquor Scam
Andhra Pradesh Politics
Tadepalli Palace
Jagan Mohan Reddy
KNageswara Rao
AP SIT Investigation

More Telugu News