తమిళనాడులో షోలింగర్ నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్... ఫొటోలు ఇవిగో!
- తమిళనాడు పర్యటనకు వెళ్లిన లోకేష్
- కొండపైకి రోప్‌వేలో వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు
- 420 మెట్లు నడిచి యోగ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన
- లోకేష్ వెంట ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్
మార్గమధ్యలో భక్తులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్ తమిళనాడులో పర్యటించారు. రాణిపేట జిల్లా షోలింగర్‌లోని ప్రసిద్ధ యోగ లక్ష్మీ నరసింహస్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, డాక్టర్ మురళీ మోహన్ ఉన్నారు.
షోలింగర్ చేరుకున్న మంత్రి లోకేష్‌కు ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోప్‌వే ద్వారా కొండపై ఉన్న యోగ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు లోకేష్‌కు వేదాశీర్వచనం అందించి, శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అక్కడి నుంచి సమీపంలోని మరో కొండపై కొలువైన యోగ ఆంజనేయస్వామిని కూడా మంత్రి దర్శించుకున్నారు. కాలినడకన 420 మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకుని స్వామివారికి పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో కనిపించిన భక్తులను లోకేష్ ఆప్యాయంగా పలకరించారు.