సనాతన ధర్మం ఏం చెబుతోందంటే?: చెన్నై సినీ వేడుకలో హీరో అర్జున్

  • మనిషి ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో సనాతన ధర్మం చెబుతోందన్న అర్జున్
  • సనాతన ధర్మం మతం కాదు, జీవన విధానమని వ్యాఖ్య
  • తల్లిదండ్రుల్లా సనాతన ధర్మాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్య
తమిళనాడులో సనాతన ధర్మంపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు అర్జున్ 'సనాతన ధర్మం'పై స్పందించారు. ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే సనాతన ధర్మమని అన్నారు. ఇది ఒక జీవన విధానమని అభివర్ణించారు.

చెన్నైలో జరిగిన ఒక సినిమా వేడుకలో ఆయన మాట్లాడుతూ, సనాతన ధర్మం విలువలను నేటి యువత అవగతం చేసుకోవాలని సూచించారు. "సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, జీవన విధానం. తల్లిదండ్రులను దేవుళ్లలా ఎలా గౌరవించాలో ఈ ధర్మం తెలియజేస్తుంది. మీరు మీ తల్లిదండ్రులను విస్మరించలేరు... అలాగే సనాతన ధర్మాన్ని కూడా తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు" అని పేర్కొన్నారు.

మనిషి ఎలా ప్రవర్తించాలో ఈ ధర్మం తెలియజేస్తుందని అన్నారు. దొంగతనం చేయకూడదని, ఒకరిపై అసూయ ఉండవద్దని నేర్పుతుందని పేర్కొన్నారు. తమ పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటారో, తల్లిదండ్రులను కూడా అదేవిధంగా చూసుకోవాలని సనాతన ధర్మం చెబుతుందని అన్నారు. అర్జున్ హీరోగా నటించిన 'బ్లాస్ట్' చిత్రం నిన్న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ఈరోజు చెన్నైలో జరిగింది. ఈ నేపథ్యంలో అర్జున్ సనాతన ధర్మంపై స్పందించారు.

Arjun Sarja
Sanatana Dharma
Udhayanidhi Stalin
Dravida Munnetra Kazhagam
Blast Movie
Chennai

More Telugu News