ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు సూర్యవంశీకి గవాస్కర్ మూడు ముక్కల సందేశం!

Vaibhav Suryavanshi Gavaskars Three Word Message Before SRH Match
  • గవాస్కర్‌ ఆశీస్సులు తీసుకున్న వైభవ్
  • ‘ఇలాగే కొనసాగించు’ అని గవాస్కర్ సూచన
  • వైభవ్‌ టీ20 అరంగేట్రానికి మద్దతు
  • వయసుతో సంబంధం లేదన్న సన్నీ
  • ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచన
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముల్లన్‌పూర్‌ వేదికగా జరిగిన ప్రీ-మ్యాచ్ షోలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రాక్టీస్ చేస్తూ సమీపంలో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ను చూసిన వైభవ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు.

గవాస్కర్ సందేశం
పెద్దల పట్ల వైభవ్ చూపిన గౌరవానికి ఫిదా అయిన సునీల్ గవాస్కర్ అతనికి ఇచ్చిన సందేశాన్ని వెల్లడించారు. ‘‘వైభవ్ నా పాదాలను తాకినప్పుడు నేను అతనితో కేవలం ‘లగే రహో బేటే, లగే రహో’ (ఇలాగే కొనసాగించు నాన్నా) అని మాత్రమే చెప్పాను’’ అని తెలిపారు. ఒకవేళ తాను కూడా అతనితో కలిసి మైదానంలో బ్యాటింగ్ చేస్తూ అవతలి ఎండ్‌లో ఉన్నా ఇదే మాట చెప్పేవాణ్నని సన్నీ వివరించారు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ 12 సిక్సర్లు బాది ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

టీ20 జట్టులోకి
ఈ అద్భుత ప్రదర్శన తర్వాత వైభవ్‌కు గవాస్కర్ పూర్తి మద్దతుగా నిలిచారు. 2026 వైభవ్ సూర్యవంశీ సంవత్సరంగా గుర్తుండిపోతుందని ప్రశంసించారు. ఇంగ్లండ్‌తో జరగబోయే తదుపరి టీ20 సిరీస్‌కు అగణ్ని భారత జట్టుకు ఎంపిక చేయాలని సెలక్టర్లను సూచించారు. 15 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో 15 ఏళ్ల అనుభవం ఉన్న బౌలర్లను సైతం భయం లేకుండా ఎదుర్కొంటున్నాడని, కాబట్టి అతనికి జట్టులో అవకాశం ఇవ్వడానికి వయసుతో అస్సలు సంబంధం లేదని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
IPL 2026
Sunrisers Hyderabad
Rajasthan Royals
Sunil Gavaskar
Cricket
T20
Chris Gayle
Indian Cricket Team

More Telugu News