సూర్య ఈ సారి ఏం చేస్తాడో చూడాలి మరి!
- సూర్య హీరోగా 'విశ్వనాథ్ అండ్ సన్స్'
- కథానాయిక పాత్రలో మామితా బైజూ
- దర్శకుడిగా వెంకీ అట్లూరి ప్రయోగం
- ఆగస్టు 14వ తేదీన విడుదల
సూర్య తన కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడా పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అయితే ఆయనకి సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వచ్చిన 'వీరభద్రుడు' (కరుప్పు) కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమిళనాడులో మాత్రం బాగానే ఆడిందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం నుంచి ఒక అప్ డేట్ వచ్చింది.
తనకి తెలుగు దర్శకులతో కలిసి పనిచేయాలని ఉందనీ, నేరుగా తెలుగు సినిమా చేయాలని ఉందని సూర్య ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నాడు. ఇన్నాళ్లకి ఆయన కల నిజమైందని చెప్పచ్చు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే 'విశ్వనాథ్ అండ్ సన్స్'. రీసెంటుగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమాను ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.
ఒక 40 ఏళ్ల యువకుడికీ .. 20 ఏళ్ల యువతికి మధ్య నడిచే ప్రేమకథ ఈ సినిమాలో ప్రధానమైనదిగా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు. మామితా బైజు కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రాధికా శరత్ కుమార్ .. రవీనా టాండన్ కీలకమైన పాత్రలను పోషించారు. సితార బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. చాలాకాలంగా సూర్య వెయిట్ చేస్తున్న భారీ హిట్, ఈ సినిమాతోనైనా పడుతుందేమో చూడాలి