8 గంటల పాటు గాల్లో చక్కర్లు.. ఢిల్లీకి తిరిగొచ్చిన శాన్ఫ్రాన్సిస్కో విమానం
- సాంకేతిక సమస్య కారణంగా చైనా గగతలం నుంచి వెనక్కి మళ్లిన విమానం
- సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడి
- ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఎయిరిండియా
230 మంది ప్రయాణికులతో శాన్ఫ్రాన్సిస్కో వెళుతున్న ఎయిరిండియా విమానం, ఎనిమిది గంటలకు పైగా గాలిలో ప్రయాణించిన తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా ఆ విమానం చైనా గగనతలం నుంచి ఢిల్లీకి తిరిగివచ్చింది. విమాన సంస్థ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300 ఈఆర్ బుధవారం శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది.
విమానం చైనా గగనతలంలో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తడంతో 8 గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరింది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎయిరిండియా తెలిపింది. ప్రయాణీకులకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామని, వారిని సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.