ఒట్టి చేతులతో పాములను పట్టుకున్న అమెరికా మంత్రి.. చివరికి జరిగింది ఇదీ!
- రెండు పాములతో ఆడుకున్న యూఎస్ ఆరోగ్య మంత్రి రాబర్ట్ కెన్నడీ
- ఈ క్రమంలో ఆయన చేతిపై కాటు వేసిన ఓ పాము
- ఫ్లోరిడాలోని ప్రముఖ డాక్టర్ మెహ్మెత్ ఓజ్ ఇంట్లో ఈ ఘటన
- ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- ఆయనను కాటు వేసింది విషం లేని పాము అని తేలిన వైనం
అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ పాము కాటుకు గురయ్యారు. ఫ్లోరిడాలో రెండు పాములను పట్టుకొని ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన 49 సెకన్ల వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్‍గా మారింది.
ఈ వీడియోలో కెన్నడీ షర్ట్, టై ధరించి ఉండటం చూడవచ్చు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న ప్రముఖ వైద్యుడు మెహ్మెత్ ఓజ్ ఇంటి ఆవరణలో ఆయన రెండు 'సదరన్ బ్లాక్ రేసర్' జాతి పాములను ఒట్టి చేతులతో పట్టుకున్నారు. ఈ సమయంలో ఆయన భార్య చెరిల్ హిన్స్ 'జాగ్రత్త' అని హెచ్చరించడం వినిపిస్తుంది. రెండు పాములను కుడి చేతిలో పట్టుకున్నప్పుడు, వాటిలో ఒకటి హఠాత్తుగా ఆయన ఎడమ చేతిపై కాటు వేసింది. దీంతో ఆయన నొప్పితో చేయి విదిలించారు. అక్కడే ఉన్న మరో మహిళ 'మీకు పిచ్చి పట్టిందా' అని అనడం కూడా వీడియోలో రికార్డయింది. కెన్నడీని కాటు వేసిన పాములకు విషం ఉండదని, ఇవి ఫ్లోరిడాలో సాధారణంగా కనిపించేవేనని తెలిసింది.
ఇదిలా ఉంటే.. వన్యప్రాణులతో కెన్నడీ ప్రవర్తన గతంలోనూ చర్చనీయాంశమైంది. చనిపోయిన ఎలుగుబంటి పిల్లను న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో వదిలేశానని ఆయనే అంగీకరించారు. అలాగే, హైవేపై చనిపోయిన ఒక జంతువు శరీరం నుంచి కొంత భాగాన్ని కత్తిరించుకున్నట్లు కూడా ఆయనపై కథనాలు వచ్చాయి.
ఈ తాజా వీడియోపై అమెరికా ఆరోగ్య శాఖ స్పందించలేదు. అయితే పాము కాటు తర్వాత కెన్నడీ బాగానే ఉన్నారని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఘటన తర్వాత ఆ పాములను ఏం చేశారనే దానిపై స్పష్టత లేదు.