ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు?

27-05-2026 Wed 07:26 | Andhra
Advertisement
  • కర్ణాటక కోటా నుంచి షర్మిలకు కేటాయించే అవకాశం
  • గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కసరత్తు
  • హరిప్రసాద్, రాజీవ్ గౌడలతో పాటు పలువురి పేర్ల పరిశీలన
  • ఏపీ ఎంపీగా ముగిసిన పరిమళ నత్వానీ పదవీకాలం
  • ఝార్ఖండ్ నుంచి బీజేపీ తరఫున నత్వానీ పోటీ చేసే యోచన
Advertisement
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లభించే మూడు రాజ్యసభ స్థానాలకు గాను వైఎస్ షర్మిల పేరును అధిష్ఠానం ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చిన మాట ప్రకారం ఆమెను కర్ణాటక కోటా నుంచి ఎగువసభకు పంపించేందుకు ఢిల్లీ స్థాయిలో జోరుగా కసరత్తు సాగుతోంది.

ఈ స్థానాల కోసం కర్ణాటక స్థానిక నేతలైన బీకే హరిప్రసాద్, రాజీవ్ గౌడ పేర్లు ప్రముఖంగా వినపడుతుండగా, కేంద్ర స్థాయి నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పవన్ ఖేడా, సుప్రియా శ్రీనటేల పేర్లను కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. వీరితో పాటు వైఎస్ షర్మిల పేరు కూడా ఈ జాబితాలో చేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ కోటాలో ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రిలయన్స్ ప్రతినిధి పరిమళ నత్వానీ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన మళ్లీ ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి ఎగువసభకు ఎన్నికయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో ఝార్ఖండ్ నుంచి రెండు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన నత్వానీ, ఈ విడతలో మాత్రం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో ఝార్ఖండ్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి జేఎంఎం అధినేత కుటుంబం నుంచి ఒక మహిళా సభ్యురాలిని బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి రెండో స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నప్పటికీ, ఆ పార్టీకి ఉన్న 16 మంది శాసనసభ్యుల బలం సరిపోవడం లేదు. ఝార్ఖండ్‌లో ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం 24 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు సాంకేతిక సమీకరణాలు ప్రతిబంధకంగా మారాయి.
Advertisement
YS SharmilaRahul GandhiRajya SabhaKarnatakaCongress PartyRajya Sabha SeatParimal NathwaniJharkhandBK HariprasadRajeev Gowda

More Telugu News

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51
..more