'డాన్ 3' వివాదం: మౌనమే తన సమాధానమన్న రణ్వీర్ సింగ్
- గౌరవప్రదంగా సమస్యలు పరిష్కరించుకోవాలని నమ్ముతానన్న నటుడు
- రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ ఉత్తర్వులు జారీ చేసిన సినీ కార్మిక సమాఖ్య
- షూటింగ్‌కు ముందు తప్పుకోవడంతో రూ.45 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణ
- ఫెడరేషన్తో సమావేశానికి రణ్వీర్ నిరాకరించడంతో వివాదం
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్.. 'డాన్ 3' సినిమా వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోవడంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రణ్వీర్ సింగ్ టీమ్ తొలిసారిగా స్పందించింది. అయితే, ఆరోపణలను నేరుగా ప్రస్తావించకుండా మౌనంగా, గౌరవప్రదంగా ఉండటమే మేలని తమ వైఖరిని స్పష్టం చేసింది.
ఈ విషయంపై రణ్వీర్ సింగ్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. "వృత్తిపరమైన చర్చలు, వ్యక్తిగత సమీకరణాలను గౌరవంగా, పరిణతితో, పరస్పర అవగాహనతో నిర్వహించాలని రణ్వీర్ బలంగా నమ్ముతారు. 'డాన్ 3' విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించకపోవడానికి కారణం ఇదే. ఊహాగానాలకు ఆజ్యం పోయడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన దృష్టి పూర్తిగా తన పని, భవిష్యత్ కమిట్మెంట్లపైనే ఉంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. డాన్ ఫ్రాంచైజీకి, అందులో భాగమైన ప్రతి ఒక్కరికీ రణ్వీర్ ఎంతో గౌరవం ఇస్తారని, ఆ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారని తెలిపారు.
ఏమిటీ వివాదం?
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న 'డాన్ 3' నుంచి రణ్వీర్ సింగ్ ఆకస్మికంగా తప్పుకోవడం ఈ వివాదానికి దారితీసింది. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ ప్రారంభం కావడానికి కేవలం మూడు వారాల ముందు రణ్వీర్ ఈ నిర్ణయం తీసుకున్నారని నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఏప్రిల్ 11న ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఫెడరేషన్ నిర్మాతలతో సమావేశమైంది. ప్రీ-ప్రొడక్షన్ కోసం చేసిన ఖర్చుల వివరాలను వారు సమర్పించినట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిత్ తెలిపారు. "200 మందికి పైగా సిబ్బంది కోసం హోటల్స్, లొకేషన్లు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్‌లన్నీ చేశారు. దీనివల్ల నిర్మాతలకు సుమారు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని వారు ఆధారాలతో సహా వివరించారు" అని ఆయన పేర్కొన్నారు.
తమ వాదనలు వినిపించేందుకు ఫెడరేషన్ ముందు హాజరు కావాలని రణ్‌వీర్‌కు మూడుసార్లు రిమైండర్లు పంపినా స్పందించలేదని అశోక్ పండిత్ ఆరోపించారు. దీంతో, రణ్వీర్తో ఎవరూ కలిసి పనిచేయవద్దని కోరుతూ సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసినట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. "చట్టం కంటే ఏ సూపర్ స్టార్ గొప్ప కాదు అనే సందేశాన్ని పరిశ్రమకు పంపాలని మేము నిర్ణయించుకున్నాం. ఆయన మాతో వ్యక్తిగతంగా సమావేశమయ్యే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి" అని ఆయన స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం 'డాన్ 3'లో హీరోగా రణ్వీర్ను ప్రకటించారు. డిసెంబర్ 2025లో ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ వైదొలిగాడు.