తిరుమలలో బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు... దర్శనానికి 30 గంటలు

  • తిరుమలలో విపరీతమైన భక్తుల రద్దీ
  • శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం
  • బాట గంగమ్మ ఆలయం వరకు చేరిన క్యూలైన్లు
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు
  • నిన్న శనివారం 97 వేల మందికి పైగా స్వామివారి దర్శనం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో విపరీతమైన రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. యాత్రికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూలైన్లు బయటకు ఏకంగా బాట గంగమ్మ ఆలయం వరకు పొడిగించారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 నుంచి 30 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

వేసవి సెలవులు, వారాంతం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. రద్దీ తీవ్రతకు అనుగుణంగా టీటీడీ అధికారులు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్నవారికి తాగునీరు, అల్పాహారం వంటివి అందిస్తున్నారు.

టీటీడీ గణాంకాల ప్రకారం, నిన్న మే 23వ తేదీ శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 97,561 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 57,780 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజున శ్రీవారి హుండీకి రూ. 3.76 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 

Tirumala
Sri Venkateswara Swamy
TTD
Tirumala temple
queue lines
devotees
rush
Va વૈకుంఠం queue complex
Bata Gangamma temple

More Telugu News