కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైరల్!
- ఎస్ఆర్హెచ్పై కృనాల్ పాండ్యా వినూత్న బౌలింగ్
- అతని బౌలింగ్ యాక్షన్‌తో అయోమయంలో కావ్య మారన్
- ఇలాంటి బౌలింగ్‌కు అనుమతి ఉందా? అని ఆశ్చర్యం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా తన వినూత్న బౌలింగ్‌తో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతని బౌలింగ్ శైలి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ యాక్షన్‌ను చూసిన ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్ సైతం అయోమయానికి గురయ్యారు.
ఐపీఎల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా తన సైడ్-ఆర్మ్ యాక్షన్‌తో పాటు బ్యాటర్లపై బౌన్సర్లను కూడా అస్త్రంగా ప్రయోగించాడు. ఇది చూసిన కావ్య మారన్, అసలు ఇలాంటి బౌలింగ్‌కు అనుమతి ఉందా? అన్నట్లుగా హావభావాలు ప్రదర్శించారు. స్టాండ్స్‌లో కూర్చున్న ఆమె ముఖ కవళికలు కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో ఆమె పక్కన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ఉన్నారు.
అయితే, కావ్య మారన్‌ను అంతగా ఆశ్చర్యపరిచిన కృనాల్ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తాను వేసిన రెండు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. అనంతరం బ్యాటింగ్‌లో 31 బంతుల్లో 41 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 55 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. కృనాల్ ప్రదర్శన జట్టును గెలిపించలేకపోయింది.