జిమ్‌లో శ్రియా రెడ్డి ‘కర్రసాము’ విన్యాసాలు.. వీడియోలు వైరల్‌!

Shriya Reddys Karrasamu Stunts in Gym Viral Videos
  • కాలికి గాయమైనా జిమ్‌లో శ్రియా రెడ్డి కసరత్తులు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘కర్రసాము’ వీడియోలు
  • వేగంగా కర్రలు తిప్పిన నటి
  • తన అంతర్గత శక్తిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్
  • ఆమె ఫిట్‌నెస్‌పై నెటిజన్ల ఆశ్చర్యం
నటి శ్రియా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాలికి గాయమై కట్టు కట్టి ఉన్నప్పటికీ ఆమె జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ కనిపించారు. కేవలం వర్కవుట్లు మాత్రమే కాకుండా ఆమె చేసిన కర్రసాము విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఒంటి చేత్తో విన్యాసాలు
శ్రియా రెడ్డి మొత్తం మూడు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. మొదటి దాంట్లో ఒంటి చేత్తో కర్రను గిరగిరా తిప్పుతూ అదరగొట్టారు. రెండో వీడియోలో రెండు చేతులతో రెండు కర్రలను చాలా వేగంగా తిప్పుతూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక మూడో దాంట్లో జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు చేస్తూ కనిపించారు. ఆమె ఫిట్‌నెస్‌ పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

హనుమాన్ కాంప్లెక్స్ మెసేజ్
ఈ వీడియోలతో పాటు శ్రియా రెడ్డి పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. ‘‘మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఒక్కో అడుగు వేస్తున్నా. మన బలాన్ని మనం మర్చిపోవడాన్నే 'హనుమాన్ కాంప్లెక్స్' అంటారు. జీవితం తిరిగి గుర్తుచేసే వరకు మన శక్తి ఏంటో మనకు తెలియదు. సముద్రాన్ని దాటే ముందు హనుమంతుడికి కూడా జాంబవంతుడు ఆయన శక్తిని గుర్తుచేయాల్సి వచ్చింది. మనల్ని మనం నమ్మడానికి కొన్నిసార్లు మనకూ ఒకరు కావాలి’’ అని ఆమె రాసుకొచ్చారు.
Go Back to Shorts
Shriya Reddy
Shriya Reddy fitness
Shriya Reddy workout
Shriya Reddy karrasamu
karrasamu videos
gym workout
Hanuman complex
fitness motivation
viral videos

More Telugu News