భారత పర్యాటకులకు థాయ్‌లాండ్ కొత్త రూల్స్.. పూర్తిగా మారిన వీసా నిబంధనలు
- భారత్‌తో సహా 93 దేశాలకు 60 రోజుల ఉచిత వీసా పథకం రద్దు
- భారత్‌ను వీసా ఆన్ అరైవల్ కేటగిరీకి మార్చిన థాయ్‌లాండ్
- ఇకపై భారత పర్యాటకులకు ఆ దేశంలో 15 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి
- భద్రతా కారణాలు, నాణ్యమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి
- ఈ నెల 19న ఈ కొత్త వీసా విధానాలకు ఆమోదం తెలిపిన థాయ్‌లాండ్ కేబినెట్
భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన విహారయాత్ర గమ్యస్థానాల్లో ఒకటైన థాయ్‌లాండ్, తన వీసా నిబంధనల్లో సంచలన మార్పులు చేసింది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గతంలో ప్రవేశపెట్టిన 60 రోజుల ఉచిత వీసా పథకాన్ని భారత్‌తో సహా 93 దేశాలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీసా కేటగిరీలను క్రమబద్ధీకరించి, సులభతరం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పు భారత పర్యాటకులపై గణనీయమైన ప్రభావం చూపనుంది.
థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రకారం ఈ నెల 19న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కొత్త వీసా విధానాలకు ఆమోదం లభించింది. "ఒక దేశం, ఒక వీసా మినహాయింపు హక్కు" అనే కొత్త మార్గదర్శక సూత్రం ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త నిబంధనలు రాయల్ గెజిట్‌లో ప్రచురించిన 15 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి.
భారత్‌పై ప్రభావం ఏమిటి?
ఈ మార్పులతో భారత పర్యాటకులకు ఇప్పటివరకు లభించిన వీసా రహిత ప్రవేశ సౌకర్యం దూరమవుతుంది. జూలై 2024లో భారత్‌కు 60 రోజుల ఉచిత వీసా పథకాన్ని థాయ్‌లాండ్ వర్తింపజేసింది. దీని ద్వారా ఎక్కువ రోజులు విహారయాత్రకు ప్లాన్ చేసుకునే వారికి థాయ్‌లాండ్ మరింత ఆకర్షణీయంగా మారింది. అయితే, తాజా నిబంధనల ప్రకారం, భారతదేశాన్ని ‘వీసా ఆన్ అరైవల్’ (వీఓఏ) కేటగిరీకి మార్చారు. అంటే, ఇకపై భారత పర్యాటకులు థాయ్‌లాండ్ చేరుకున్నాక అక్కడి ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్ల వద్ద అవసరమైన పత్రాలు సమర్పించి వీసా పొందాల్సి ఉంటుంది. ఈ కేటగిరీ కింద కేవలం 15 రోజులు మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతి లభిస్తుంది. సుదీర్ఘ సెలవులకు బదులుగా చిన్న పర్యటనలకు మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది.
నిబంధనల మార్పుకు కారణమేమిటి?
మొదట పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 60 రోజుల ఉచిత వీసా పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ఈ విధానం వల్ల భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయని థాయ్‌లాండ్ ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా అక్రమ ఉపాధి, బినామీ వ్యాపారాలు, అంతర్జాతీయ నేరాలు పెరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్యాటకుల సంఖ్య కంటే నాణ్యమైన పర్యాటకులను ఆకర్షించడంపైనే ఇప్పుడు దృష్టి సారిస్తున్నామని, ఆర్థిక ప్రయోజనాలు, దేశ భద్రతను సమన్వయం చేయడమే తమ లక్ష్యమని థాయ్‌లాండ్ పర్యాటక, క్రీడల శాఖ మంత్రి సురసక్ ఫంచరోయెన్‌వొరాకుల్ గతంలోనే సూచనప్రాయంగా తెలిపారు.
కొత్త వీసా కేటగిరీలు ఇలా ఉన్నాయి:
వీసా ఆన్ అరైవల్ (వీఓఏ): కేవలం 4 దేశాలకు (అజర్‌బైజాన్, బెలారస్, సెర్బియా, భారత్) పరిమితం. వీరికి 15 రోజుల బసకు అనుమతి ఉంటుంది.
30 రోజుల వీసా మినహాయింపు: ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, సింగపూర్ సహా 54 దేశాలకు ఈ సౌకర్యం కొనసాగుతుంది.
15 రోజుల వీసా మినహాయింపు: సీషెల్స్, మాల్దీవులు, మారిషస్ దేశాలకు వర్తిస్తుంది.
ఇప్పటికే పాత వీసా మినహాయింపు పథకం కింద థాయ్‌లాండ్‌లో ఉన్నవారిపై, లేదా కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే ప్రయాణించేవారిపై తక్షణ ప్రభావం ఉండదు. వారి అనుమతి గడువు ముగిసే వరకు దేశంలో ఉండవచ్చు. అయితే, కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ప్రయాణించేవారు సవరించిన నిబంధనల ప్రకారమే వీసా పొందాల్సి ఉంటుంది.