ఫ్లిప్‌కార్ట్ డెలివరీలు ఇకపై పోస్ట్‌మ్యాన్ ద్వారా.. ఇండియా పోస్ట్‌తో కీలక ఒప్పందం
- ఫ్లిప్‌కార్ట్, భారత తపాలా శాఖ మధ్య కీలక డెలివరీ ఒప్పందం
- దేశవ్యాప్తంగా లాస్ట్ మైల్ డెలివరీ సేవలు అందించనున్న ఇండియా పోస్ట్
- 1.6 లక్షల పోస్టాఫీసుల నెట్‌వర్క్‌తో పార్శిళ్ల పంపిణీ
- ప్రీపెయిడ్, క్యాష్ ఆన్ డెలివరీ సేవలు అందుబాటులోకి
- ఈ-కామర్స్ లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం
భారత ఈ-కామర్స్ రంగంలో డెలివరీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ పార్శిళ్లను దేశవ్యాప్తంగా చివరి మైలు వరకు (లాస్ట్ మైల్ డెలివరీ) ఇండియా పోస్ట్ పంపిణీ చేయనుంది.
ఈ మేరకు న్యూఢిల్లీలో శుక్రవారం ఒప్పంద పత్రాలపై తపాలా శాఖ పార్శిల్ డైరెక్టరేట్ జనరల్ మేనేజర్ నీరజ్ కుమార్ ఝా, ఫ్లిప్‌కార్ట్ ఇండియా కమర్షియల్ డైరెక్టర్ హర్విందర్ కపూర్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఇరు సంస్థల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ ఒప్పందంతో దేశంలోని పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు సైతం ఫ్లిప్‌కార్ట్ సేవలు మరింత సమర్థవంతంగా అందనున్నాయి. ఇండియా పోస్ట్ తనకున్న 1.6 లక్షల పోస్టాఫీసుల విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్ ప్రీపెయిడ్, క్యాష్ ఆన్ డెలివరీ (COD) పార్శిళ్లను డెలివరీ చేస్తుంది. ఓటీపీ ఆధారిత డెలివరీ, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి ఆధునిక సేవలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.
ఈ భాగస్వామ్యం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌కు మార్కెట్ విస్తరణ పెరగనుండగా, తపాలా శాఖకు పార్శిల్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందుతుంది. మారుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా తమను తాము అగ్రగామి లాజిస్టిక్స్ సంస్థగా మార్చుకోవాలన్న తపాలా శాఖ లక్ష్యానికి ఈ ఒప్పందం ఊతమిస్తుందని అధికారులు తెలిపారు.