19 ప్లాట్లు, 2 ఎకరాల్లో ఫామ్ హౌస్... మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ అరెస్టు

  • ఉదయం నుంచి ఆయన కార్యాలయం సహా 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
  • బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు 
  • వనస్థలిపురం, మణికొండ, మజీద్‌కొండ ప్రాంతాల్లో రూ.4.46 కోట్ల విలువైన 19 ప్లాట్లు గుర్తింపు
  •  రూ.1.2 కోట్ల విలువైన 3 ఇళ్లను గుర్తించిన అధికారులు
మేడ్చల్ మల్కాజ్‌గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. ఈరోజు ఉదయం నుంచి ఆయన కార్యాలయం సహా మరో 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో వంశీమోహన్‌కు సంబంధించిన భారీగా ఆస్తులను గుర్తించారు. వనస్థలిపురం, మణికొండ, మజీద్‌కొండ ప్రాంతాల్లో రూ.4.46 కోట్ల విలువైన 19 ఓపెన్ ప్లాట్లు, రూ.1.2 కోట్ల విలువైన 3 ఇళ్లను గుర్తించారు.

ఇబ్రహీంపట్నం పరిధిలోని నారపల్లి వద్ద 2 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో వంశీమోహన్ ఆర్డీవోగా పనిచేశారు. ఆర్డీవోగా పని చేసిన సమయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

అబ్దుల్లాపూర్‌మెట్, పిగ్లీపురంలో ఎనిమిది ఎకరాలు ఆక్రమించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. భూములను తొలుత తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత రియల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఒక రియల్టర్ నుంచి పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.

Vamsi Mohan
Medchal Malkajgiri
Deputy Collector
ACB Raids
Corruption Case
Illegal Assets
Land Scam

More Telugu News