రేపు సొంత జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!

Chandrababu Naidu to Visit Chittoor District Tomorrow
  • శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
  • కండ్రిగలో 'సంజీవని' ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
  • సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి
  • పర్యటనలో భాగంగా పార్టీ కేడర్‌తోనూ ప్రత్యేక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మే 23) సొంత జిల్లా చిత్తూరులో పర్యటించనున్నారు. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తలపెట్టిన 'సంజీవని' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

వివరాల్లోకి వెళితే, శనివారం ఉదయం 9 గంటలకు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, ఉదయం 11 గంటలకల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ప్రజా వేదికలో పాల్గొని, 'సంజీవని' కార్యక్రమానికి శ్రీకారం చుడతారు.

ఈ కార్యక్రమం అనంతరం, మధ్యాహ్నం 1:35 గంటలకు సీఎం సంతగేటులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 2:20 గంటలకు సంతగేటు సమీపంలోనే టీడీపీ కార్యకర్తలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కేడర్‌కు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం, సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి పయనమవుతారని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Chittor District
Andhra Pradesh
Sanjeevani Program
Yadamarri
TDP Cadre Meeting
Government Hospital
Health Services
Amaravati

More Telugu News