రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు రికార్డు

  • రెండేళ్లలో 150 కేసుల్లో నిందితులకు శిక్షలు
  • బాధితులకు పునరావాసం కోసం రూ.3 కోట్ల వరకు నష్టపరిహారం
  • బాధితులకు పరిహారం త్వరితగతిన అందేలా న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశాలు
రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సరికొత్త రికార్డును సృష్టించింది. చిన్నారులపై జరిగిన 150 లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు శిక్షలు విధించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే వారికి శిక్షలు విధించడం గమనార్హం. పోక్సో చట్టం-2012 కింద నమోదవుతున్న కేసులను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు.

గత రెండేళ్లుగా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసుల విచారణలో వేగం పెరిగింది. పోక్సో కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరగడంతో శిక్షలు, జరిమానాలు కూడా విధిస్తున్నారు. బాధితుల పునరావాసం కోసం అన్ని కేసుల్లో కలిపి దాదాపు రూ.3 కోట్లకు పైగా నష్టపరిహారాన్ని మంజూరు చేశారు. ఈ పరిహారం కూడా బాధితులకు త్వరగా అందేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది.

రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు గత రెండేళ్ల కేసులను పరిశీలిస్తే, 10 కేసుల్లో నిందితులకు తుదిశ్వాస విడిచే వరకు శిక్షపడగా, 15 కేసుల్లో యావజ్జీవ శిక్షలు ఖరారయ్యాయి. మరో 35 కేసుల్లో ఇరవై ఏళ్ల కారాగార శిక్ష, 17 కేసుల్లో 14 ఏళ్ళ కారాగార శిక్ష విధించింది. ఏడేళ్లు, ఐదేళ్ళు, మూడేళ్ళు, రెండేళ్లు, ఏడాది జైలు శిక్షలు పడిన కేసులు కూడా ఉన్నాయి.

Rangareddy District Court
POCSO Act
POCSO Fast Track Court
Child Sexual Abuse Cases
Telangana Courts

More Telugu News