మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు

ACB Raids on Medchal Deputy Collector Vamsi Mohans Residence
  • ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
  • ఆర్డీవోగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున భూములు కాజేసినట్లు ఆరోపణలు
  • ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని రియాల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఆరోపణలు
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి ఆయనకు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన వంశీమోహన్ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూములను తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత రియల్టర్లకు ధారాదత్తం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
Vamsi Mohan
Medchal Malkajgiri
ACB Raid
Deputy Collector
Corruption Case
Illegal Assets
Land Grabbing

More Telugu News