మెగా క్లాప్: 30 ఏళ్ల రివర్స్ సీన్.. తమ్ముడి క్లాప్‌పై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!

  • నేడు లాంఛనంగా ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం
  • అన్నయ్య సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు పవన్ కల్యాణ్
  • 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాను గుర్తుకు తెచ్చుకున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఓపెనింగ్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన అన్నయ్య చిరంజీవిపై తీసిన ముహూర్తపు షాట్‌కు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లాప్ బోర్డ్ వెనుక ఉన్న ఒక అద్భుతమైన 30 ఏళ్ల నాటి విషయాన్ని గుర్తుచేస్తూ చిరంజీవి ఎక్స్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


"ఈ రోజు కల్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే... 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది ... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు థాంక్యూ" అని చిరంజీవి భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

ఫ్లాష్‌బ్యాక్: సరిగ్గా 30 సంవత్సరాల క్రితం, పవన్ కల్యాణ్ హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన క్లాసిక్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' (1996). ఆరోజు ఆ సినిమా ముహూర్తపు షాట్‌కు అన్నయ్యగా చిరంజీవి ముందుండి తమ్ముడు పవన్ కల్యాణ్‌కు క్లాప్ కొట్టి వెండితెరకు పరిచయం చేశారు. ఇవాళ అదే సీన్ రివర్స్ అయింది. ఆరోజు అన్నయ్య క్లాప్ కొట్టి తమ్ముడిని ఆశీర్వదించారు. ఈరోజు తమ్ముడు ఏకంగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి.. అన్నయ్య 158వ సినిమాకు క్లాప్ కొట్టారు. మూడు దశాబ్దాలు గడిచినా, మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం మాత్రం అలాగే ఉందనడానికి ఈ క్లాప్ బోర్డ్ విజువల్ ఒక పెద్ద నిదర్శనం.


మరోవైపు, ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ యువ నటి అనశ్వర రాజన్ కీలక పాత్ర పోహిస్తోంది.

Chiranjeevi
Pawan Kalyan
Mega Brothers
Chiranjeevi 158
Akada Ammayi Ikada Abbayi
Bobby Kolli
KVN Productions
Thaman
Anaswara Rajan
Telugu Cinema

More Telugu News