భారత్‌లో టాప్-10 బిలియనీర్లు వీరే!

India Has Record 229 Billionaires in Forbes List Led by Mukesh Ambani
  • మొదటి రెండు స్థానాల్లో అంబానీ, అదానీ
  • దేశంలోనే సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
  • కుబేరులైన ‘ఫిజిక్స్ వాలా’ వ్యవస్థాపకులు
  • 31 ఏళ్ల వయసులోనే బిలియనీర్‌గా అరవింద్ శ్రీనివాస్
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించినప్పటికీ భారతీయ బిలియనీర్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా-2026 ప్రకారం.. భారత్ నుంచి రికార్డు స్థాయిలో 229 మంది ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వీరి మొత్తం ఆస్తి విలువ తొలిసారి లక్ష కోట్ల డాలర్ల మార్కును దాటడం విశేషం. ఈసారి రికార్డు స్థాయిలో 30 మంది కొత్తవారు ఈ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు.

తొలి 2 స్థానాల్లో అంబానీ, అదానీ
భారత్‌లోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 99.7 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా మౌలిక సదుపాయాల రంగ దిగ్గజం గౌతమ్ అదానీ 63.8 బిలియన్ డాలర్ల ఆస్తితో రెండో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఈ రెండు గ్రూపులు కలిపి ఏకంగా 210 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి.

మూడో స్థానంలో సావిత్రి జిందాల్ 
ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్ 39.1 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఓవరాల్‌గా ఆమెకు మూడో స్థానం దక్కింది.  కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ 14.4 బిలియన్ డాలర్ల ఆస్తితో పదో స్థానంలో నిలిచి ఈ టాప్ గ్రూపులోకి ప్రవేశించారు.

యూట్యూబ్ క్లాస్ నుంచి బిలియనీర్స్ క్లబ్‌కు
భారతీయ ఎడ్‌టెక్ రంగంలో ఈసారి సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ‘ఫిజిక్స్ వాలా’ కో-ఫౌండర్లు అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ ఈసారి బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించారు. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన తమ కంపెనీ ఐపీఓ సూపర్ హిట్ కావడంతో ఈ ఇద్దరు కుబేరుల క్లబ్‌లోకి అడుగుపెట్టారు.

31 ఏళ్ల వయసులోనే కుబేరుడిగా
ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా అరవింద్ శ్రీనివాస్ (31) రికార్డు సృష్టించారు. జెఫ్ బెజోస్ మద్దతుతో నడుస్తున్న ‘పెర్‌ప్లెక్సిటీ’ ఏఐ సెర్చ్ స్టార్టప్ కో-ఫౌండర్ అయిన ఈయన శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కొన్నేళ్ల విరామం తర్వాత ‘పేటీఎమ్’ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మళ్లీ బిలియనీర్ల జాబితాలోకి పునరాగమనం చేశారు. మరోవైపు ‘ఓలా క్యాబ్స్’ ఫౌండర్ భవీష్ అగర్వాల్‌తో పాటు మరో ఏడుగురు ఈసారి బిలియనీర్ల హోదాను కోల్పోయారు.

టాప్‌-10 జాబితా
  • ముకేశ్ అంబానీ - 99.7 బిలియన్ డాలర్లు
  • గౌతమ్ అదానీ - 63.8 బి.డా
  • సావిత్రి జిందాల్ - 39.1 బి.డా
  • లక్ష్మీ మిట్టల్ - 31.0 బి.డా
  • శివ్ నాడార్ - 30.9 బి.డా
  • సైరస్ పూనావాలా - 27.0 బి.డా
  • దిలీప్ సంఘ్వీ - 25.6 బి.డా
  • కుమార్ బిర్లా - 21.1 బి.డా
  • రాధాకిషన్ దమానీ - 15.7 బి.డా
  • ఉదయ్ కోటక్ - 14.4 బి.డా
Go Back to Shorts
Mukesh Ambani
Indian billionaires
Forbes list
Gautam Adani
Savitri Jindal
Richest Indians
India billionaires 2024
Uday Kotak
Alakh Pandey
Billionaires list

More Telugu News