అమెరికాలో వృద్ధులే టార్గెట్... భారత కాల్ సెంటర్ మూసివేత
- వందలాది వృద్ధుల నుంచి మిలియన్ల కొద్ది డాలర్ల దోపిడీ
- మియామీకి చెందిన టెలి కమ్యూనికేషన్స్ ద్వారా మోసం
- ఆరేళ్ళ క్రితం దర్యాప్తు ప్రారంభం.. బయటకొచ్చిన భారతీయుల పేర్లు
అమెరికా, విదేశాల్లోని వృద్ధుల నుంచి లక్షలాది డాలర్లను దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక కాల్ సెంటర్ నెట్ వర్క్ ను అమెరికా అధికారులు మూసివేయించారు. వందలాదిమంది వృద్ధుల నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లను ఈ సంస్థ దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏళ్ళ తరబడి దర్యాప్తు చేసిన ఎఫ్బీఐ ఐదుగురు టెలీమార్కెటింగ్ మోసగాళ్ల నేరాలను నిరూపించింది. ఈ మేరకు బోస్టన్లోని ఎఫ్బీఐ ప్రకటించింది.
మయామీకి చెందిన ఆడమ్ యంగ్, లాస్ వెగాస్కు చెందిన హారిసన్ గెవిర్జ్ టెలీకమ్యూనికేషన్ సంబంధిత సేవలను అందించే సంస్థను నడుపుతున్నారు. ఆ కంపెనీ కాల్ రూటింగ్, టెలిఫోన్ నెంబర్స్, కాల్ ట్రాకింగ్, కాల్ ఫార్వార్డ్ సర్వీసులు అందిస్తుంది. అయితే, ఈ సంస్థ సేవలను వాడుకుని భారతదేశానికి చెందిన కాల్ సెంటర్లు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. తమ సంస్థలో మోసాలు జరుగుతున్నట్లు యంగ్, హారిసన్లకు తెలుసు. ఆరేళ్ల క్రితం దర్యాప్తు ప్రారంభం కాగా, మరో ఐదుగురు భారతీయుల పేర్లు బయటకు వచ్చాయి.
వీరంతా అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని, భారత్ కేంద్రంగా టెలీ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. జగ్మీత్ సింగ్ విర్క్ అనే వ్యక్తిపై కూడా నేరం నిరూపణ అయినట్లు ఎఫ్బీఐ వెల్లడించింది.