భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లు.. వాటిపై దాడి చేశామన్న పాకిస్థాన్ అధికారి
- ఆపరేషన్ బున్యాల్ ఉల్ మార్సూస్ పేరుతో దాడులు చేసినట్లు వెల్లడి
- రెండు ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి
- రాజౌరి, మామూన్ ఎయిర్‌బేస్‌లపై దాడి చేశామన్న పాక్ అధికారి
- ఆ పేరుతో ఎయిర్ బేస్‌లు లేకపోవడం గమనార్హం
గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిస్పందనగా పాకిస్థాన్, భారత నగరాలు మరియు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ మరియు క్షిపణి దాడుల జరిపిందట. 'ఆపరేషన్ బున్యాన్ ఉల్ మార్సూస్' పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్ ద్వారా జమ్ము కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లలో కనీసం 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందట.
ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు. రెండు ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నామని ఆయన తెలిపారు. కానీ మన దేశంలో ఆ పేరుతో ఎయిర్‌బేస్‌లు లేకపోవడం గమనార్హం. భారత్‌లోని రాజౌరీ, మామూన్ ఎయిర్ బేస్‌లను తమ క్షిపణులు తాకాయని ఆయన చెప్పారు. ఆయన పేర్కొన్న ప్రాంతాల్లో ఎయిర్ బేస్‌లు లేవనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారు.
రాజౌరీ జమ్ముకశ్మీర్‌లోని ఒక జిల్లా కాగా, అక్కడ భారత వైమానిక దళ ఎయిర్ బేస్ లేదు. మామూన్ పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సమీపంలో ఉన్న ఒక కంటోన్మెంట్ ప్రాంతం. ఈ విషయాలు తెలుసుకోకుండా ఆయన మాట్లాడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
రాజౌరి, మామూన్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేయాలని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ అధికారి పేర్కొన్నారు. దీంతో ఫతా-1 క్షిపణులతో ఆ రెండు ఎయిర్ బేస్‌లను నిర్మూలించినట్లు చెప్పారు.