హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే నమ్మించి.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం

  • ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం
  • టీ తాగుదామని పిలిచి, మద్యం తాగించి అత్యాచారం
  • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్ 
హైదరాబాద్‌ శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడే ఓ బీటెక్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టీ తాగుదామని పిలిచి, బలవంతంగా మద్యం తాగించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల విజయ్, ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనతో పాటే చదువుతున్న యువతితో అతనికి స్నేహం ఉంది. ఈ నెల 14వ తేదీ రాత్రి, టీ తాగుదామని విజయ్ ఆ యువతిని బయటకు పిలిచాడు. ఆమె అంగీకరించడంతో తన కారులో దిల్‌సుఖ్‌నగర్ తీసుకెళ్లాడు.

తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం యువతిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన యువతి, తనపై అత్యాచారం జరిగిందని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 17న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిన్న‌ నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad crime
Ibrahimpatnam
B.Tech student rape
Dilsukhnagar
Telangana crime news
student arrested
sexual assault

More Telugu News