తిలక్ వర్మతో అఫైర్ అంటూ వార్తలు... ప్రకటన విడుదల చేసిన శ్రీలీల టీమ్

  • నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మపై వస్తున్న పుకార్లపై స్పందన
  • డేటింగ్ వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమని ప్రకటన
  • ఇద్దరూ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని స్పష్టం చేసిన టీమ్
  • నిజానిజాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి
ప్రముఖ నటి శ్రీలీల, యువ క్రికెటర్ తిలక్ వర్మ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె టీమ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా నిరాధారమైన, అవాస్తవ కథనాలని అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలీల బృందం ఒక ప్రకటన విడుదల చేసింది.

"శ్రీలీల, తిలక్ వర్మకు సంబంధించి వ్యాప్తి చెందుతున్న పుకార్లు పూర్తిగా నిరాధారమైనవి, అసత్యమైనవి. వారిద్దరూ ఇప్పటివరకు ఒకరినొకరు కనీసం కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు కూడా. ఈ ఊహాగానాల్లో ఎలాంటి వాస్తవం లేదు. వాస్తవ నిర్ధారణ లేకుండా ఇలాంటి కల్పిత కథనాలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాం," అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా ఖాతాలతో పాటు పాటు కొన్ని మీడియా వేదికల్లోనూ కథనాలు వెలువడిన నేపథ్యంలో శ్రీలీల టీమ్ ఈ వివరణ ఇచ్చింది. వ్యక్తిగత విషయాలపై వార్తలు రాసేటప్పుడు మీడియా, సోషల్ మీడియా యూజర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేసింది. 

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై తరచూ ఇలాంటి పుకార్లు రావడం సహజమే అయినప్పటికీ, ఈ ప్రచారం ఎక్కువ కావడంతో వెంటనే స్పందించి పుకార్లకు అడ్డుకట్ట వేయాలని శ్రీలీల బృందం నిర్ణయించుకుంది. ఈ అధికారిక ప్రకటనతో శ్రీలీల, తిలక్ వర్మ రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.

Sreeleela
Tilak Varma
Sreeleela Tilak Varma affair
Sreeleela dating rumors
Tilak Varma dating rumors
actress Sreeleela
cricketer Tilak Varma
social media rumors
Telugu actress
Indian cricketer

More Telugu News