కట్టుకున్న భార్యపై కర్కశం.. ప్రైవేట్ భాగాల్లో రాడ్ పెట్టి హత్య

Pradeep Agaria Arrested for Brutal Murder of Pregnant Wife in Chhattisgarh
  • ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఘటన
  • భార్య గర్భవతి కావడంతో కడుపులోని బిడ్డ కూడా మృతి 
  • హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
  • ఆసుపత్రిలో వదిలేసి పరారైన నిందితుడు
  • గాలించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఛత్తీస్‌గఢ్‌లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య గర్భవతి అని కూడా చూడకుండా ఓ భర్త ఆమెను అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేశాడు. సర్గుజా జిల్లా మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిట్టికలా సెమర్‌ఘాట్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 23 ఏళ్ల గర్భిణి హీరాబాయి, ఆమె కడుపులోని బిడ్డ మృతి చెందారు. నిందితుడైన ఆమె భర్త ప్రదీప్ అగరియాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రదీప్ తన భార్య హీరాబాయిపై దాడి చేసి పన్నెండు అంగుళాల ఇనుప పనిముట్టును ఆమె ప్రైవేట్ భాగాల్లో చొప్పించి చిత్రహింసలకు గురిచేశాడు. దీనివల్ల తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె, కడుపులోని బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, నిందితుడు ఆమెను తన మోటార్‌సైకిల్‌కు కట్టుకుని అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

ఆసుపత్రిలో తన భార్యకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయని వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో భయాందోళనలకు గురైన ప్రదీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు మే 15న హీరాబాయి సోదరుడు తన సోదరిపై ఆమె భర్త దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోస్ట్‌మార్టమ్ నివేదికలో చిత్రహింసల వివరాలు బయటపడటంతో ఈ కేసు తీవ్ర సంచలనం రేపింది. ఈ నేరం క్రూరత్వం చూసి స్థానికులు నిర్భయ కేసును గుర్తుచేసుకుంటున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు ఖైర్‌బార్ గంఝాదండ్ డ్యామ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో దాక్కున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భార్యపై దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడని, ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Pradeep Agaria
Chhattisgarh crime
Heerabai murder
Surguja district
Manipur police station
Domestic violence India
Crime news
Brutal murder
беременная женщина
Private parts

More Telugu News