అఫ్గాన్‌ స్టార్‌ ప్లేయర్‌ రహ్మత్‌ షా చనిపోయాడా? సోషల్‌ మీడియాలో వార్త వైరల్‌

Rahmat Shah Mother Death Misinformation Creates Confusion
  • రహ్మత్‌ తల్లి మరణంతో ఇంట్లో విషాదం
  • కరీమ్ జనత్ పెట్టిన పోస్ట్ వైరల్
  • ఇన్‌స్టా తప్పు అనువాదం వల్ల గందరగోళం
  • సురక్షితంగా ఉన్న రహ్మత్‌
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రహ్మత్ షా చనిపోయినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 32 ఏళ్ల రహ్మత్ షా మరణించాడంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నట్లు తేలింది.

అఫ్గాన్ ఆల్‌రౌండర్ కరీమ్ జనత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ వల్ల ఈ గందరగోళం మొదలైంది. రహ్మత్ షా తల్లి మరణించడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కరీమ్ జనత్ పష్తో భాషలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు రహ్మత్ షా ఫొటోను జత చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఆ పష్తో సందేశాన్ని ఇంగ్లీషులోకి తప్పుగా అనువదించింది. రహ్మత్ షా తల్లి చనిపోయారనే విషయాన్ని మార్చేసి, రహ్మత్ షానే చనిపోయాడంటూ తప్పుడు అర్థం వచ్చేలా చూపించింది. దీంతో అభిమానులు కంగారుపడి ఆ వార్తను వైరల్ చేశారు.

రహ్మత్ షా గత ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అఫ్గానిస్థాన్ తరఫున చివరిసారిగా ఆడాడు. ఆ సిరీస్‌లో గాయం కారణంగా అతడు చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాడు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ యాప్ చేసిన తప్పు అనువాదం వల్లే ఈ ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.
Go Back to Shorts
Rahmat Shah
Rahmat Shah death
Afghanistan cricket
Karim Janat
Fake news
Cricket news
Afghanistan cricket team
Social media rumors
Rahmat Shah mother
Instagram translation error

More Telugu News