గుడ్‌న్యూస్‌.. 20 వేల టన్నుల వంట గ్యాస్‌ లోడ్‌తో భారత్‌కు చేరిన నౌక

17-05-2026 Sun 10:44 | National
Advertisement
  • గుజరాత్‌ చేరిన ‘సైమీ’ ట్యాంకర్‌
  • 13న హర్మూజ్‌ దాటిన నౌక
  • జలసంధి దాటిన 11వ ఎల్‌పీజీ ట్యాంకర్‌
  • సరఫరాలో అంతరాయంతో పడిపోతున్న ఇంధన నిల్వలు
Advertisement
ఎల్‌పీజీ లోడ్‌తో ఉన్న ‘సైమీ’ ట్యాంకర్ సురక్షితంగా గుజరాత్‌లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం మధ్య మే 13వ తేదీన ఈ నౌక హర్మూజ్‌ జలసంధిని దాటింది.

దీంట్లో మొత్తం 21 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది ఉక్రేనియన్లు, 13 మంది ఫిలిప్పీన్స్ పౌరులు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో హర్మూజ్‌ను విజయవంతంగా దాటిన 11వ ఎల్‌పీజీ ట్యాంకర్ ‘సైమీ’. 

షిప్పింగ్, విదేశాంగ, రక్షణ, చమురు శాఖల సమన్వయంతో ‘సైమీ’ భారత్‌కు చేరుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. హర్మూజ్‌ జలసంధిలో 75 రోజులుగా అంతరాయాల కారణంగా భారత్ ముడిచమురు నిల్వలు గణనీయంగా తగ్గాయి.

గడిచిన కొన్ని నెలల్లోనే భారతదేశ చమురు నిల్వలు దాదాపు 15 శాతం మేర పడిపోయాయి. ఫిబ్రవరి చివరలో ఈ సంక్షోభం ప్రారంభమైనప్పుడు చమురు నిల్వలు 107 మిలియన్ బారెల్స్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిల్వలు 91 మిలియన్ బారెల్స్‌కు పడిపోయాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్ తెలిపింది.

దిగుమతులు తగ్గినప్పటికీ భారతీయ రిఫైనరీలు తమ కార్యకలాపాలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ప్రాసెసింగ్ పనుల్లో ఇప్పటివరకు ఎలాంటి కోతలు విధించకుండా స్థిరంగా సాగిస్తున్నాయి. అయితే సరఫరాలో అంతరాయాలు కొనసాగితే రిఫైనరీల నిర్వహణ భారంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ముడిచమురు ప్రాసెసింగ్ స్థాయులను తగ్గించుకోవడం మినహా వేరే మార్గం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement
India LPGLPG TankerHormuz StraitCrude Oil Reserves IndiaOil Supply CrisisKandla PortIndia Energy ImportsWest Asia CrisisCrude Oil ProcessingSymi Tanker

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more