ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!

  • రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఘటన
  • బీ-1 ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు
  • 68 మంది ప్రయాణికులు సురక్షితం
  • మంటలు వ్యాపించిన బోగీని వేరు చేసిన రైల్వే అధికారులు
  • ప్రయాణికులను ఇతర కోచ్‌లలోకి మార్చి ప్రయాణం కొనసాగింపు
రాజస్థాన్‌లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ఏసీ కోచ్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.

కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు వెళ్తున్న 12431 రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5:15 గంటల సమయంలో రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఉన్న విక్రమ్‌గఢ్ అలోట్ రైల్వే స్టేషన్ వద్ద రైలు బీ-1 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కోచ్‌లో 68 మంది ప్రయాణికులు ఉన్నారు.

వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మంటలు వ్యాపించిన కోచ్‌ను రైలు నుంచి వేరు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్ల (OHE) సరఫరాను నిలిపివేశారు. బోగీ నుంచి దట్టమైన నల్లటి పొగలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, ఇతర కోచ్‌లలోకి మార్చారు. కోటా స్టేషన్‌లో ప్రయాణికుల కోసం మరో అదనపు కోచ్‌ను జతచేస్తామని అధికారులు ప్రకటించారు. 

Rajdhani Express
Rajdhani Express fire
Rajasthan train accident
Train fire accident
Indian Railways
Delhi train
Kerala train
Hazrat Nizamuddin
Vikramgarh Alot
Kota

More Telugu News