ఫ్లిప్‌కార్ట్‌కు 8 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు... అసలేమిటీ 'మార్క్' గొడవ?
- 'మార్క్' బ్రాండ్ వివాదంలో ఫ్లిప్‌కార్ట్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- ఇన్వెంటరీ క్లియర్ చేసుకునేందుకు 8 వారాల గడువు
- కింది కోర్టుల ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం
- 'మార్క్'(MarQ), 'మార్క్ (MARC)' పేర్లు వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తాయని వ్యాఖ్య
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు ట్రేడ్‌మార్క్ వివాదంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 'మార్క్' (MarQ) బ్రాండ్‌పై ఉన్న తమ ఇన్వెంటరీని అమ్ముకోవడానికి న్యాయస్థానం 8 వారాల తుది గడువు విధించింది. ఈ వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. ఫ్లిప్‌కార్ట్ వాడుతున్న 'మార్క్'(MarQ), 'మార్క్ ఎంటర్‌ప్రైజెస్' వాడుతున్న 'మార్క్' (MARC) పేర్లు ఉచ్ఛారణలో, వాణిజ్యపరంగా ఒకేలా ఉన్నాయని, వినియోగదారులలో గందరగోళానికి దారితీస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. "వాణిజ్యపరంగా ఒకేలాంటి లేదా మోసపూరితంగా కనిపించే పేర్లను అనుమతించలేం" అని కోర్టు స్పష్టం చేసింది.
ఫ్లిప్‌కార్ట్ తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపిస్తూ, రీబ్రాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను క్లియర్ చేయడానికి సమయం కావాలని కోరారు. దీనిపై జస్టిస్ బాగ్చి తీవ్రంగా స్పందించారు. 2018లో ఇంజంక్షన్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కొత్తగా 'మార్క్' ఉత్పత్తులను తయారు చేసి అమ్మడం సరికాదని, ఇది పూర్తిగా ఫ్లిప్‌కార్ట్ సొంత రిస్క్‌తో చేసుకున్న పని అని వ్యాఖ్యానించారు.
ఈ వివాదం 2018లో మొదలైంది. 'మార్క్ ఎంటర్‌ప్రైజెస్' తమ ట్రేడ్‌మార్క్‌ను ఫ్లిప్‌కార్ట్ వాడకుండా నిరోధించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులలో ఈ కేసు నడిచింది. ఇటీవల ఏప్రిల్ 10న ఢిల్లీ హైకోర్టు కూడా 'మార్క్' వాడకంపై ఇంజంక్షన్‌ను కొనసాగిస్తూ తీర్పు ఇచ్చింది.
ఫ్లిప్‌కార్ట్ 2017లో 'మార్క్' పేరుతో టీవీలు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను సొంత బ్రాండ్‌గా ప్రవేశపెట్టింది. మరోవైపు, 'మార్క్ ఎంటర్‌ప్రైజెస్' 1984 నుంచి ఇదే తరహా ఎలక్ట్రికల్ ఉత్పత్తుల వ్యాపారంలో ఉంది. తాజా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫ్లిప్‌కార్ట్ తమ 'మార్క్' బ్రాండ్ ఉత్పత్తుల అమ్మకాలను 8 వారాల్లో నిలిపివేయాల్సి ఉంటుంది.