బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ

  • నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడి
  • పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామన్న సీపీ
  • ఈ నెల 8న బండి భగీరథ్‌పై పోక్సో కేసు
మైనర్ బాలిక కుటుంబం ఫిర్యాదుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈరోజు పోలీసుల ఎదుట బండి భగీరథ్ లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్పందించారు. బండి భగీరథ్‌ను నార్సింగిలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్టు చేసినట్లు చెప్పారు. అతడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నామని అన్నారు.

ఈ నెల 8వ తేదీన బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. కాసేపట్లో పోలీసులు అతనిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. బండి భగీరథ్ దేశం దాటి వెళ్ళిపోకుండా పోలీసులు ఇటీవల లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఐదు బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Bandi Bhagirath
Cyberabad Police
POCSO Act
Minor Girl Sexual Assault Case
Narsingi
Pet Basheerabad Police Station

More Telugu News