తమిళనాడు సీఎం వద్ద హోం, యువజన సంక్షేమం.. మంత్రులకు శాఖల కేటాయింపు

Vijay Holds Home Youth Welfare Portfolio in Tamil Nadu
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై శాఖలను అట్టిపెట్టుకున్న సీఎం
  • ఎన్.ఆనంద్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కేటాయింపు
  • అదవ అర్జునకు పబ్లిక్ వర్క్స్, క్రీడల అభివృద్ధి శాఖలు
తమిళనాడు ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. విజయ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 10వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు లోక్ భవన్ శాఖలను కేటాయించింది.

ముఖ్యమంత్రి విజయ్ తన వద్ద హోం, పోలీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై శాఖలను అట్టిపెట్టుకున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పేదరిక నిర్మూలన, నీటిపారుదల ప్రాజెక్టుల శాఖలను ఎన్.ఆనంద్‌కు... పబ్లిక్ వర్క్స్, హైవేస్, మైనర్ పోర్ట్స్, క్రీడల అభివృద్ధి శాఖలను ఆదవ్ అర్జునకు... ఆరోగ్యం, మెడికల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలను డాక్టర్ కె.జి.అరుణ్ రాజ్‌కు... ఫైనాన్స్, పెన్షన్స్ శాఖల బాధ్యతలను కె.ఎ.సెంగొట్టయ్యన్‌కు అప్పగించారు.

ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్, ప్రైస్ కంట్రోల్ శాఖలను పి.వెంకటరమణన్‌కు కేటాయించారు. విద్యుత్, న్యాయ, జైళ్లు, అవినీతి నిరోధక శాఖలను ఆర్.నిర్మల్ కుమార్‌కు... స్కూల్ ఎడ్యుకేషన్, తమిళ అభివృద్ధి, సమాచార ప్రచార శాఖ, కల్చర్, ఫిల్మ్ టెక్నాలజీ శాఖలను రాజ్ మోహన్‌కు... మైన్స్ అండ్ మినరల్స్ శాఖను డాక్టర్ టి.కె.ప్రభుకు, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ శాఖల బాధ్యతలను ఎస్.కీర్తనకు అప్పగించారు.
Go Back to Shorts
Vijay
Tamil Nadu
Tamil Nadu CM
Cabinet portfolios
Government allocation
Ministers
Tamil Nadu politics

More Telugu News