ఐపీఎల్ లో చిట్టీల వ్యవహారం నిషేధించాలి: రాయుడు
- లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్ 'చిట్టీ' సెలబ్రేషన్‌పై విమర్శలు
- ఇలాంటి సెలబ్రేషన్లను నిషేధించాలని డిమాండ్ చేసిన అంబటి రాయుడు
- యువ ఆటగాళ్ల తీరుపై స్టెయిన్, మెక్‌క్లెన్‌గాన్ వంటి మాజీల అసహనం
- అది తనకు ప్రేరణ ఇస్తుందని వివరణ ఇచ్చిన ఆకాశ్ సింగ్
- చెన్నైపై విజయంలో ఆకాశ్ సింగ్ మూడు వికెట్లతో కీలక పాత్ర
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బౌలర్ ఆకాశ్ సింగ్ చేసుకున్న 'చిట్టీ' సెలబ్రేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా సంబరాలను వెంటనే నిషేధించాలని భారత మాజీ ఆటగాడు, చెన్నై మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తీవ్రంగా స్పందించాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించగా, ఆకాశ్ సింగ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లతో రాణించాడు. అయితే, అతను వికెట్ తీసిన ప్రతిసారీ తన జేబులోంచి ఒక చిన్న చిట్టీ తీసి కెమెరాలకు చూపించాడు. దానిపై '#Akkionfire – టీ20 గేమ్‌లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు' అని రాసి ఉంది. ఈ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, పలువురు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో షోలో మాట్లాడిన అంబటి రాయుడు.. "ఈ చిట్టీల వ్యాపారాన్ని నిషేధించాలి. ఇది పూర్తిగా అర్థం లేని పని. అసలు మ్యాచ్‌లోకి చిట్టీలు తీసుకురావడమే సరికాదు" అని అన్నాడు. "ఇలా చేస్తే తాను కూల్‌గా కనిపిస్తానని అతను ఏ దశలో అనుకున్నాడో తెలుసుకోవాలని ఉంది. ఇది గొప్ప ఐడియా అని అతనికి ఏ స్నేహితులు చెప్పారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నా" అని రాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఈ ట్రెండ్‌పై స్పందిస్తూ "ఆ కాగితాలను పక్కన పెట్టే సమయం వచ్చింది. అది ఇక ట్రెండింగ్ కాదు. నిజం చెప్పాలంటే అది ఎప్పుడూ ట్రెండింగ్‌లో లేదు," అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. యువ ఆటగాళ్లు ప్రదర్శనపై దృష్టి పెట్టాలని న్యూజిలాండ్ మాజీ పేసర్ మిచెల్ మెక్‌క్లీనగన్ సూచించాడు.
ఈ విమర్శలపై ఆకాశ్ సింగ్ స్పందించాడు. ఐపీఎల్ విడుదల చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ, "అది నాకు ప్రేరణ ఇస్తుంది. దాని వెనుక ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఆట సమయంలో ఏది నాకు ప్రేరణ ఇస్తుందో, దానినే నేను కొనసాగిస్తాను," అని తన చర్యను సమర్థించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, ఉర్విల్ పటేల్ వంటి కీలక వికెట్లు తీసి ఆకాశ్ సింగ్ లక్నో విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. అనంతరం మిచెల్ మార్ష్ (38 బంతుల్లో 90) మెరుపు ఇన్నింగ్స్‌తో లక్నో 188 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.