ప్రతి ప్రేమకథ పారిస్‌లోనేనా?.. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు?: పరిశ్రమను నిలదీసిన కమల్ హాసన్
- భారత సినీ పరిశ్రమకు నటుడు కమల్ హాసన్ బహిరంగ లేఖ
- సినిమాలో అనవసరపు ఖర్చులు, విదేశీ షూటింగ్‌లపై తీవ్ర అభ్యంతరం
- పొదుపు చర్యల భారం కార్మికులపై పడకూడదని స్పష్టీకరణ
- నిర్మాణంలో దుబారా, వృథా ఖర్చులే అసలు సమస్య అని వ్యాఖ్య
- పరిశ్రమ భవిష్యత్తు కోసం అందరూ కలిసి చర్చించాలని పిలుపు
భారత సినీ పరిశ్రమలో పెరిగిపోతున్న విలాసవంతమైన నిర్మాణ సంస్కృతి, అనవసరపు ఖర్చులపై ప్రముఖ నటుడు, నిర్మాత కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆర్థికంగా ఒత్తిళ్లు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలోనూ విదేశీ షూటింగ్‌ల మోజులో పడి నిర్మాతలను ఎందుకు ఖర్చుల ఊబిలోకి నెడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు మే 15న 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా భారత సినీ ప్రముఖులను ఉద్దేశించి ఆయన ఒక ఘాటైన బహిరంగ లేఖను విడుదల చేశారు.
"ప్రతి ప్రేమకథ పారిస్‌లోనే ఎందుకు వికసించాలి? ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? అదృష్టవశాత్తు ప్రేమకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ అవసరం లేదు" అని కమల్ తన లేఖలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ఇంధనం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని, ఈ తరుణంలో భారతీయ సినిమాకు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ పొదుపు చర్యలు, ఆర్థిక సర్దుబాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల వేతనాలపై ప్రభావం చూపకూడదని ఆయన స్పష్టం చేశారు. "కార్మికుల జీతాలు, వారి భద్రత, గౌరవం, ఆహారం, రవాణా, వసతి లేదా మానవతా దృక్పథంతో కూడిన పని వాతావరణం వంటి విషయాల్లో కోత విధించి పొదుపు చేయడం సరికాదు. పరిశ్రమ కోసం కష్టపడి పనిచేసే వారిపై ఆర్థిక దుబారా భారం పడకూడదు" అని ఆయన స్పష్టం చేశారు.
పరిశ్రమలో అసలు సమస్య కార్మికులకు చెల్లించే వేతనాలు కాదని, అనవసరపు వృథా, విపరీతమైన ఎంట్రాజ్ కల్చర్, నిర్మాణంలో జాప్యం, భారీతనం కోసం వెంపర్లాడటమేనని కమల్ విమర్శించారు. గొప్పదనం కేవలం విదేశాల్లోనే సాధ్యమవుతుందనే భ్రమ నుంచి బయటకు వచ్చి, మన దేశంలోని అందమైన లొకేషన్లు, ఇక్కడి నిర్మాణ వనరులపై నమ్మకం పెంచుకోవాలని సూచించారు. గతంలో ఎన్నో గొప్ప చిత్రాలు అదనపు హంగులతో కాకుండా స్పష్టత, క్రమశిక్షణ, నమ్మకంతోనే రూపుదిద్దుకున్నాయని గుర్తుచేశారు.
సినిమా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లపై నిర్మాతలు, నటీనటులు, కార్మిక సంఘాలు, ఎగ్జిబిటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఫైనాన్షియర్లు అందరూ కలిసికట్టుగా చర్చించి ఒక పరిష్కారం కనుగొనాలని కమల్ పిలుపునిచ్చారు. "ఈ రోజు మనం సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటే, రేపటి సినిమా భవిష్యత్తును కాపాడినట్లే" అని పేర్కొంటూ, తనతో సహా పరిశ్రమలోని సీనియర్లందరూ బాధ్యతాయుతమైన నిర్మాణ పద్ధతులను అవలంబించి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.