ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు
- ఈ నెల 31తో ముగుస్తున్న జి. సాయిప్రసాద్ పదవీకాలం
- పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
- మరో 6 నెలలు పదవీకాలం పొడించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జి. సాయిప్రసాద్ సేవలను మరో ఆరు నెలల పాటు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక ప్రతిపాదనలను కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) ఆమోదించింది. ఈ పొడిగింపుతో ఆయన నవంబర్ 30 వరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన విధులను నిర్వర్తించనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని ఈ నిర్ణయం బలపరుస్తోంది.