విదేశీ యువతికి సాయం చేసేందుకు ట్రాక్‌పైకి దూకాడు.. వీడియో ఇదిగో!
- రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య పడిన దుపట్టాను అందించిన వ్యక్తి
- సాయం చేశాక కృతజ్ఞత కోసం కూడా ఆగకుండా వెళ్లిపోయిన వైనం
- ఆయనే నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
- సోషల్ మీడియాలో 41 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన వీడియో
ప్రస్తుత సమాజంలో ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి ఓ మంచి మనసున్న ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఓ ఇండోనేషియా యువతికి సహాయం చేసేందుకు ఆయన ఏమాత్రం ఆలోచించకుండా రైల్వే ట్రాక్‌పైకి దూకాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, @indaha.l అనే ఇండోనేషియా డిజిటల్ క్రియేటర్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలు వద్ద నిల్చుని ఉంది. ఈ క్రమంలో ఆమె కెమెరాను సర్దుకుంటుండగా తన దుపట్టా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది. ఆమె ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉండగానే, అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించారు.
మొదట చేత్తో తీయడానికి ప్రయత్నించినా దుపట్టా అందలేదు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రాక్‌పైకి దూకి, దుపట్టాను తీసి ఆ యువతికి అందించాడు. ఆ తర్వాత ఆమె సాయం చేయబోయినా సున్నితంగా తిరస్కరించి, ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కాడు. కనీసం ఆమె చెప్పే కృతజ్ఞతల కోసం కూడా ఆగకుండా తన దారిన తాను నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.
ఈ ఊహించని సహాయానికి ఆశ్చర్యపోయిన ఆ యువతి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ "ఆయన ట్రాక్‌పైకి దూకుతారని అస్సలు ఊహించలేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఆయనకు నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చింది. ఈ వీడియోకు ఇప్పటికే 41 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆయన మంచితనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. "ఆయన ఒక హీరోలా నడిచి వెళ్లారు", "ఆ యువతి చేతిని సాయం కోసం కూడా పట్టుకోలేదు, ఆయనే నిజమైన జెంటిల్మన్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News
ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు
![]()
మెదక్‌లో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ.. 120 తులాల బంగారం అపహరణ
![]()
ఝార్ఖండ్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం
![]()
నీట్ రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష
![]()
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కీలక పరిణామం.. మాజీ మంత్రి కుమార్తె ఉద్యోగం ఊస్ట్
![]()
ట్రంప్ చైనా పర్యటనలో అనూహ్య పరిణామాలు.. అనధికారికంగా కఠిన ఆంక్షలు
![]()
ముంబై ఇండియన్స్‌తో 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై
![]()
దిగుమతి సుంకం తొలగిస్తేనే టెక్స్టైల్ గట్టెక్కేది.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
![]()
మానవ అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం... 120 మంది చిన్నారులకు విముక్తి!
![]()
ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల
![]()
ఇక గ్యాస్ కష్టాలకు చెక్: గల్ఫ్ నుంచి నేరుగా భారత్‌కు ఇంధన సరఫరా!
![]()
19 ఏళ్ల యువతి వింత అనుభవం.. కోమాలో తల్లిగా మారిపోయిన వైనం.. మేల్కొని కలలోని పిల్లల కోసం ఆరాటం!
![]()
విదేశీ యువతికి సాయం చేసేందుకు ట్రాక్‌పైకి దూకాడు.. వీడియో ఇదిగో!
![]()
తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యల దుమారం.. సహచర ఆటగాడిని అలా పిలుస్తావా? అంటూ నెటిజన్ల ఫైర్!
![]()
అడ్డంకులు దాటిన సూర్య 'కరుప్పు'.. ఈరోజే థియేటర్లలోకి!
![]()