విశాఖలో మహిళ దారుణ హత్య.. నగల కోసం ఘాతుకం!

Parvathi Murdered in Visakhapatnam for Gold Jewelry
  • నగరంలోని అక్కయపాలెంలో దారుణం
  • బంగారు ఆభరణాల కోసం 50 ఏళ్ల మహిళ హత్య
  • సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
విశాఖపట్నంలో బంగారు నగల కోసం మహిళను హత్య చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని అక్కయ్యపాలెం పరిధిలో ఈ దారుణం జరిగింది. శ్రీనివాసనగర్‌లో బంగారు ఆభరణాల కోసం 50 ఏళ్ల పార్వతి అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ ఆమెను తీవ్రంగా హింసించారు.

స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఏసీపీ లక్ష్మణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్వతి హైదరాబాద్‌లో ఉంటున్నారు. నిన్న రాత్రే ఆమె విశాఖకు వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Parvathi
Visakhapatnam murder
Akkayyapalem
gold robbery
crime news
Andhra Pradesh police

More Telugu News